వార్నీ.. కరోనా సోకినా మ్యాచ్ ఆడాడు?
ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఐసీసీ కూడా కఠిన నిబంధనలను మార్చుతూ సరళతరమైన నిబంధనలను తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ఉన్నప్పటికీ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు అవకాశం కల్పిస్తూ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని ఐర్లాండ్ క్రికెటర్ మొదట వినియోగించుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ క్రికెటర్ జార్జ్ డాక్రిల్ కరోనా వైరస్ సోకినప్పటికీ మ్యాచ్లో పాల్గొన్నాడు. అతనికి కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండడంతో మిగతా ప్లేయర్లకు కరోనా సోకకుండా కాస్త కఠిన నిబంధనల మధ్య అతన్ని మ్యాచ్ ఆడించారు.
అయితే ప్రపంచ క్రికెట్లో కరోనా వైరస్ సోకిన తర్వాత కూడా క్రికెట్ మ్యాచ్ ఆడిన మొదటి క్రికెటర్ గా జార్జ్ డాక్రిల్ ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా 16 బంతుల్లో 14 పరుగులు చూసాడు జార్జ్ డాక్రిల్. అయితే ఆటగాళ్ల పరిస్థితిని బట్టి కరోనా వైరస్ లక్షణాలను బట్టి ఇక మ్యాచ్ ఆడించేందుకు అవకాశం కల్పించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అయితే కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఐసీసీ ఇలాంటి రూల్స్ తీసుకోవచ్చింది అన్న విషయం తెలిసిందే.