ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తు... పరువు మొత్తం పాయె !
అయితే ఒక దశలో ఐర్లాండ్ కనీసం 180 పరుగులు చేస్తుంది అని అనిపించినా ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని వరుస వికెట్లు తీసి ఐర్లాండ్ ను కేవలం 157 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. ముఖ్యంగా లివింగ్స్టన్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరో బౌలర్ మార్క్ వుడ్ కూడా చక్కగా బౌలింగ్ చేసి టాప్ ఆర్డర్ లో మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ 158 పరుగుల లక్ష్యంతో చేధనను ప్రారంభించగా మొదటి ఓవర్ లోనే కెప్టెన్ బట్లర్ ను అవుట్ చేసి ఐర్లాండ్ శిభిరంలో ఆశలు నింపాడు లిటిల్. అలా పవర్ ప్లే లో మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను ఒత్తిడిలోకి నెట్టేసింది . కానీ మిగిలిన ఆటగాళ్లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
ఇన్నింగ్స్ 15 వ ఓవర్ లో మూడు బంతులు అయ్యాక వర్షం రావడంతో... ఎంతకీ తేలకవడంతో యంపైర్లు ఈ మ్యాచ్ ను డి ఎల్ ఎస్ పద్దతిలో ఆ సమయానికి ఇంగ్లాండ్ కన్నా ఐర్లాండ్ అయిదు పరుగులు ముందు ఉండడంతో ఐర్లాండ్ ను విజేతగా నిర్ణయించారు. దీనితో వరల్డ్ కప్ లో రెండవ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది. గతంలో వన్ డే వరల్డ్ కప్ 2011 లో కూడా ఐర్లాండ్ ఇంగ్లాండ్ ను ఛేదనలో ఓడించింది.