కోహ్లీ నుంచి ఈ ఐదు విషయాలు.. అందరూ నేర్చుకోవాల్సిందే?
అయితే విరాట్ కోహ్లీ గురించి ఇంతలా చర్చ జరగడానికి వెనుక ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు విరాట్ కోహ్లీ ఎంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా తనని తాను నిరూపించుకున్నాడు. ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేశాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ తో ఇబ్బందులు పడ్డాడు. దీంతో విరాట్ కోహ్లీని పొగిడిన వారే ఆ తర్వాత విమర్శించడం కూడా మొదలుపెట్టారు. ఇక ఇలాంటి కష్ట పరిస్థితులను దాటుకొని మళ్ళీ విరాట్ కోహ్లీ ప్రపంచం చేత సలాం కొట్టించుకునే స్థాయికి ఎదిగాడు.
దీన్ని బట్టి ఇక విరాట్ కోహ్లీ నుంచి 5 విషయాలను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు ఎవరి జీవితంలోనైనా సరే చెడు కాలం తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఇక ఎవరికైనా సమాధానాలు చెప్పాలి అనుకుంటే మీ పని తీరు ద్వారా మాత్రమే ప్రతిస్పందించాలి. ఇక చివరి నిమిషం వరకు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు క్లిష్ట పరిస్థితులు కూడా మన ముందు తలవంచుతాయి అన్న విషయాన్ని విరాట్ కోహ్లీని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని నిపుణులు అంటున్నారు.