ఆఫ్గనిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతు... ఛాన్స్ లేనట్లే ?
దీనితో ఇరు జట్లకు చెరో పాయింట్ ను ఇచ్చారు. దానితో న్యూజిలాండ్ కు మూడు పాయింట్లు రాగా, ఆఫ్గనిస్తాన్ మాత్రం మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో కేవలం ఒక్క పాయింట్ తో గ్రూప్ 1 నుండి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఆఫ్ఘన్ కు మిగిలింది మూడు మ్యాచ్ లు మాత్రమే. అవి కూడా ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి బలమైన జట్లతో రెండు మరియు ఐర్లాండ్ తో మరో మ్యాచ్ ఆడుతుంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే శ్రీలంక మరియు ఆసిస్ లను ఓడించడం దాదాపు అసాధ్యమే. ఇక ఐర్లాండ్ ను కూడా అంత తేలిగ్గా ఓడిస్తుంది అని అనుకోవడం లేదు.
సెమీస్ కు వెళ్లాలంటే మాత్రం మూడు మ్యాచ్ లు గెలవడం తో పాటు మెరుగైన రన్ రేట్ ను కూడా కలిగి ఉండాలి. అదే సమయంలో మిగిలిన జట్ల ఫలితాల మీద కూడా ఆధారపడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరిగి ఆఫ్ఘన్ గెలిచి ఉంటే ఛాన్స్ ఉండేది. ఆ విధంగా వర్షం కారణంగా ఆఫ్ఘన్ సెమీస్ అవకాశాలు దెబ్బ తిన్నాయి.