ఇండియా దెబ్బకు వరల్డ్ కప్ నుండి నెదర్లాండ్ అవుట్ ?
మరోసారి కె ఎల్ రాహుల్ ఫెయిల్ అవ్వడం ఒక్కటే ఈ మ్యాచ్ ఇండియాను కలవరపరిచే విషయం. 180 పరుగుల లక్ష్య ఛేదనలో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో మొదటి నుండి ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. బౌలింగ్ లో ఆకట్టుకున్న నెదర్లాండ్ బ్యాటింగ్ లో పూర్తిగా చేతులెత్తేసింది. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ ను భువి డక్ అవుట్ చేయగా, అప్పటినుండి వికెట్లు వరుసగా కోల్పోతూ లక్ష్యానికి చాలా దూరం అయిపోయింది. ఫామ్ లో ఉన్న మాక్స్ ఓడోడ్, కూపర్ మరియు యాకర్ మాన్ లు కూడా అవుట్ అవ్వడంతో కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించుకోవడంలో మిగిలిన వారు సహాయపడ్డారు.
చివరికి 20 ఓవర్లు పాటు ఆడి 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఇండియా బౌలర్లలో భువి , అర్షదీప్ , అశ్విన్ మరియు అక్షర్ పటేల్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా నెదర్లాండ్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో రెండూ ఓడిపోయి పాయింట్లు ఏమీ సాధించకుండా చివరి స్థానానికి పరిమితం అయింది. ఈ గ్రూప్ లో ఉన్న ఆరు జట్లలో సెమీస్ కు చేరుకునేది కేవలం రెండు జట్లు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిపోయిన నెదర్లాండ్ కు మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలిచినా అవకాశం ఉండకపోవచ్చు. అలా నెదర్లాండ్ అనధికారికంగా వరల్డ్ కప్ నుండి నిష్క్రమించినట్లే.. !