జింబాబ్వే ఆటను మార్చింది.. మనోడేనట తెలుసా?

praveen
ఇటీవలే పట్టిష్టమైన పాకిస్తాన్ పై విజయం సాధించిన జింబాబ్వే పేరు అటు ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోతుంది అని చెప్పాలి. అసమాన్యమైన ప్రదర్శనతో అదరగొట్టిన జింబాబ్వే జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో మంచి ప్రస్తానాన్ని కొనసాగించిన జింబాబ్వే ఆ తర్వాత ఆర్థికంగా కుదేలు కావడంతో ఒక్కసారిగా తమ ప్రాబల్యాన్ని కోల్పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సీనియర్లు జట్టు నుంచి తప్పుకోవడంతో మళ్లీ పూర్వ వైభవాన్ని పొందలేకపోయింది జింబాబ్వే.


 నాలుగేళ్ల తర్వాత వరల్డ్ కప్ లో క్వాలిఫైయర్ మ్యాచ్లలో గెలిచి సూపర్ 12 కోసం అర్హత సాధించిన జింబాబ్వే జట్టు ఇటీవల ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న పాకిస్తాన్ పై విజయం సాధించింది. అయితే ఇలా జింబాబ్వే అద్భుత ప్రదర్శన చేయడం వెనుక మనోడే ఉన్నాడు అన్నది తెలుస్తుంది. 2018లో జింబాబ్వే కోచ్గా బాధ్యతలు చేపట్టాడు లాల్ సింగ్. జింబాబ్వే ఆటలో ఎంతగానో మార్పు వచ్చేందుకు ప్రయత్నించాడు. ఇక ఏడాది జూన్ లోనే జింబాబ్వే క్రికెట్ టెక్నికల్ డైరెక్టర్గా కూడా నియమితుడు అయ్యాడు.


 ప్రస్తుతం జింబాబ్వే జట్టులో బ్యాటింగ్లో నిలకడ.. బౌలింగ్లో పదును.. ఫీల్డింగ్లో మెరుపులు.. కనిపిస్తున్నాయంటే.. ఇక అదంతా లాల్ చంద్ రాజ్ పుత్ చలవే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జింబాబ్వే లో ఉన్న ప్రతిభగల  యువ ఆటగాళ్లను గుర్తించి జట్టును పటిష్టంగా తీర్చిదిద్దాడు. ఇకపోతే ఇటీవల జింబాబ్వే గెలవడంపై లాల్ సింగ్ రాజపుత్ స్పందించాడు. తాను కోచ్ గా అడుగు పెట్టినప్పుడు జింబాబ్వే క్రికెట్ అస్తవ్యస్తంగా ఉంది.. సీనియర్లు మేం ఆడమని మొండికేశారు. వారిని బుజ్జగించి మళ్లీ గాడిలో పెట్టాల్సి వచ్చింది. కుర్రాళ్ళకు తమలో సత్తా ఉంది అనే విషయం అర్థమయ్యేలా చేసి ఆత్మవిశ్వాసం పెంపొందించాం. 2022 టి20 ప్రపంచ కప్ జింబాబ్వే అర్హత సాధించడం నా కల. మా ఆటగాళ్లు నా కలలు నిజం చేశారు అంటూ లాల్ చంద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: