కేఎల్ రాహుల్ మెంటల్ కండిషన్ పై.. స్పెషల్ స్పెషల్?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఎంతో విజయవంతమైన ప్రస్థానానికి కొనసాగిస్తుంది. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుసగా విజయాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పాకిస్తాన్ నెదర్లాండ్స్ పై విషయాలు సాధించి ఇక అటు గ్రూప్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇక టీమిండియా రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇలా టీమిండియా ఓవరాల్ ప్రదర్శన బాగున్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం ఓపెనర్  రాహుల్ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు.


 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడగా.. అటు రెండు మ్యాచ్ లలో కూడా  రాహుల్ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు అని చెప్పాలి. తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి చివరికి జట్టుని  కష్టాల్లోకి నెట్టాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగులు.. మొన్నటికి మొన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.  అయితే కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ మాత్రం అటు టీమిండియాను కలవరపెడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక కేఎల్ రాహుల్ ను మళ్ళీ ఫామ్ లోకి తీసుకువచ్చేందుకు టీమిండియా కోచింగ్ సిబ్బంది ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు సాగుతుంది అన్నది తెలుస్తుంది.



 ఇక కేఎల్ రాహుల్ తన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న నేపథ్యంలో తన మెంటల్ కండిషన్ గురించి స్పెషల్ కోచ్ ప్యాడి ఆమ్టన్ ట్రైనింగ్ ఇప్పించబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఇకపోతే కేఎల్ రాహుల్ ఈరోజే ప్యాడి ఆమ్టన్ ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు ఈ మెంటల్ కండిషన్ సెక్షన్ ఉండబోతుందట. టెక్నికల్ గా రాహుల్ బ్యాటింగ్లో లోపాలు లేకపోవడంతో మానసికంగా బలహీనపడి ఉండవచ్చని భావించిన టీమిండియా యాజమాన్యం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఆసియా కప్ ముందు విరాట్ కోహ్లీ కూడా ప్యాడి ఆమ్టన్ ను కన్సల్ట్ అయ్యాడు. తర్వాత కోహ్లీ ఏ స్థాయిలో రాణించాడో చూస్తూనే ఉన్నామ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: