టెస్టుల్లో అరంగేట్రం, వీడ్కోలు మ్యాచ్ లలో.. సెంచరీ చేసింది వీళ్లే?
అయితే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మ్యాచ్ లో మాత్రమే కాదు ఇక వీడ్కోలు పలికినప్పుడు ఆడిన చివరి మ్యాచ్లో కూడా సెంచరీ చేయడం అనేది నిజంగా ఆటగాళ్లు అందరికీ జీవితంలో గొప్ప అనుభూతి అని చెప్పాలి. ఇక ఇలా టెస్ట్ కెరీర్ కు ఎంతో ఘనంగా వీడ్కోలు పలికిన ఆటగాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ వీడ్కోలు మ్యాచ్లో సెంచరీ చేసిన వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పాలి. ఆ లిస్టు చూసుకుంటే..
గ్రేట్ చాపెల్ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రేట్ చాపల్ 1970లో టెస్ట్ లోకి అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. 108 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక 14 ఏళ్ల కెరియర్ లో చివరి మ్యాచ్ సీడ్నిలో పాకిస్తాన్ తో ఆడాడు. ఇక 1984 లో చివరి మ్యాచ్లు 122 పరుగులు చేసి ఇక వీడ్కోలు మ్యాచ్లో కూడా సెంచరీ సాధించి రికార్డ్ సృష్టించాడు.
మహమ్మద్ అజారుద్దీన్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ పేరు కూడా ఇలా అరంగేట్రం వీడ్కోలు మ్యాచ్లో కూడా సెంచరీ చేసిన ఆటగాళ్ల లిస్టులో ఉంది అని చెప్పాలి. 1984లో ఇంగ్లాండ్ పై ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. ఇక మొదటి మ్యాచ్ లోనే 110 పరుగులు ఇన్నింగ్స్ తో సెంచరీ తో అదరగొట్టాడు. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్ లో కూడా 102 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ఆలిస్టర్ కుక్ : ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ అలెస్టర్ కు కూడా ఈ రికార్డు సాధించాడు. 2006లో నాగపూర్ లో ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఇక ఆ తర్వాత ఓవల్లో చివరి మ్యాచ్ ఆడాడు. అతను ఇక చివరి టెస్ట్ ఇన్నింగ్స్ లో కూడా 147 పరుగులు చేసి సెంచరీ తో అదరగొట్టాడు. ఇలా అరంగేట్రం మ్యాచ్లో వీడ్కోలు సెంచరీ చేసిన ఆటగాళ్లు ఈ ముగ్గురే ఉన్నారని చెప్పాలి.