భువి ఇస్ బ్యాక్.. ఏం వేసాడబ్బా?
ఇలా ఇప్పటివరకు టీం ఇండియా తరఫున ఎంతో విజయవంతమైన ప్రస్తానాన్ని కొనసాగించిన భువనేశ్వర్ కుమార్ గత కొంతకాలం నుంచి మాత్రం అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒకవైపు వికెట్లు పడగొడుతున్నప్పటికీ మరోవైపు డెత్ ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ ఫామ్ కోల్పోయాడని అతని పక్కనపెట్టి ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటూ ఎంతోమంది ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఇలా పేలవమైన ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొన భువనేశ్వర్ కుమార్ ఎప్పుడు వరల్డ్ కప్ లో మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు.
ఒకవైపు పరుగులు కట్టడి చేస్తూనే మరోవైపు ఇక డాట్ బాల్స్ వేస్తూ బ్యాట్స్మెన్ లపై ఒత్తిడి పెంచుతూ ఉన్నాడు ఇక ఇంకోవైపు వికెట్లు కూడా పడగొడుతూ ఉండడం టి20 ప్రపంచ కప్ లో భాగంగా భువనేశ్వర్ కుమార్ 42 బంతులు వేయగా అందులో 30 డాట్ బాల్స్ ఉండడం గమనార్హం. ఇక టి20 క్రికెట్లో ఇలా అత్యధిక డాట్ బాల్స్ వేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు భువనేశ్వర్ కుమార్. ఇలా తన గణాంకాలతో తాను ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు అందరూ కూడా ది లెజెండ్ ఇస్ బ్యాక్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.