శ్రీలంక చెత్త రికార్డు.. మరీ ఇంత దారుణంగానా?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో సంచలనాలు నమోదు అవుతూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . అతి కష్టం మీద క్వాలిఫైర్ మ్యాచ్ లలో విజయం సాధించి సూపర్ 12 కు అర్హత సాధించిన పసికూన జట్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి   ఇప్పటివరకు ఏకంగా ప్రపంచ కప్ లో మాజీ విశ్వ విజేతలుగా కొనసాగుతున్న జట్లను సైతం ఓడిస్తూ సంచలనాలు నమోదు చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అదే సమయంలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కొన్ని జట్లు మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉండడం గమనార్ధం.


 ఇలా ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఊహించని రీతిలో అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది ఛాంపియన్  శ్రీలంక అని చెప్పాలి. పసికూన నమిబియా చేతిలో ఓటమితోనే టోర్నీ ఆరంభించిన శ్రీలంక జట్టు ఆ తర్వాత కూడా అదే రీతిలో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉంది అని చెప్పాలి. ఇక శ్రీలంక పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఇక ఆ దేశ మాజీ ఆటగాళ్ళు ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శ్రీలంక పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే ఇటీవల శ్రీలంక జట్టు మరో చెత్త రికార్డును ఖాతాలో వేసుకొని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి.


 సాధారణంగా టి20 ఫార్మాట్ అంటే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు. ఇక టి20 ఫార్మాట్లో పవర్ ప్లే అంటే చాలు సిక్సర్లు ఫోర్లతో స్టేడియం దద్దరిల్లి పోతూ   ఉంటుంది అని చెప్పాలి.  కానీ ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పవర్ ప్లే లో అతి తక్కువ పరుగులు చేసి చెత్త రికార్డును నమోదు చేసింది శ్రీలంక జట్టు. మొదటి ఆరు ఓవర్లకు లంక కేవలం 24 పరుగులు మాత్రమే చేసింది. అదే సమయంలో అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఇదే మ్యాచ్లో తొలితే బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఆరు ఓవర్లలో 25 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇలా అప్పటికే న్యూజిలాండ్ చెత్త రికార్డు నమోదు చేసిందంటే.. చివరికి శ్రీలంక జట్టు ఆ రికార్డును బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: