టీమిండియా గెలవాలని.. పాక్ అభిమానుల ప్రార్థనలు?
ఇకపోతే సాధారణంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోవాలని ఆ దేశ అభిమానులు అందరూ కోరుకుంటారు. అయితే కేవలం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు మాత్రమే కాకుండా భారత్ ఇతర దేశాలతో మ్యాచ్ ఆడినప్పటికీ ఇక పాక్, ఇండియా రెండు జట్ల మధ్య ఉన్న వైరం కారణంగా భారత్ ఓడిపోవాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు అని చెప్పాలి ఇక మాజీ ఆటకాళ్లు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ భారత్ ఓడిపోతే బాగుంటుంది అన్నట్లుగానే అక్కసు వెళ్లగకుతూ ఉంటారు. కానీ మొదటిసారి పాకిస్తాన్ అభిమానులు భారత్ గెలవాలని కోరుకుంటున్నారు.
అదేంటి పాకిస్తాన్ అభిమానులు ఏంటి భారత్ గెలవాలని కోరుకోవడం ఏంటి ఇది ఏదో విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.. అయితే ఇలా పాక్ అభిమానులు టీమిండియా గెలవాలని కోరుకోవడంలో కూడా ఒక స్వార్థం ఉంది అని చెప్పాలి. పాకిస్తాన్ సెమీఫైనల్ వెళ్ళాలి అంటే భారత జట్టు తప్పక గెలవాల్సి ఉంది. ఇక పాకిస్తాన్ ఆడబోయే మిగతా మూడు మ్యాచ్లు కూడా తప్పక గెలవాలి. ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే ఆడబోయే చెరొ ఒక మ్యాచ్లో కూడా ఓటమిపాలు కావాల్సి ఉంది. ఇక ఇవన్నీ జరిగితేనే పాకిస్తాన్ సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది అని చెప్పాలి.