పాకిస్తాన్.. అది కలలో కూడా ఊహించు ఉండదు : హార్భజన్

praveen
ఈ ఏడాది  ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో ఒకటిగా కొనసాగుతుంది పాకిస్తాన్. బలమైన బౌలింగ్ లైన్ ప్రపంచ స్థాయి బౌలర్లు ఇంకోవైపు ఇక ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే బ్యాట్స్మెన్లు.. ఇక ఇలా పటిష్టంగా కనిపించడంతో పాకిస్తాన్కు ఈసారి వరల్డ్ కప్ లో తిరుగులేదు అని అందరూ భావించారు. ముఖ్యంగా పాకిస్తాన్ అభిమానులు అయితే తమ దేశం తరపున వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తారు అని భారీ అంచనాలే పెట్టుకున్నారు.

 కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డట్టు భారీ అంచనాల మధ్య వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన పాకిస్తాన్ అంచనాలను అందుకోలేక విమర్శలు ఎదుర్కొంటుంది. ఫ్లాప్ ప్రదర్శనతో అందరిని నిరాశలో ముంచేస్తుంది. వరల్డ్ కప్ లో భాగంగా మొదట మ్యాచ్లో భారత్తో తలబడింది. ఇక ఎంతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయింది. అయితే గట్టి పోటీ ఇవ్వడంతో ఇక పాకిస్తాన్ అభిమానులు కూడా ఆ దేశ జట్టుపై ఎలాంటి విమర్శలు చేయలేదు.

 ఆ తర్వాత పసికూన జింబాబ్వేతో మ్యాచ్ ఆడిన పాకిస్తాన్ జట్టు తప్పక గెలుస్తుంది అని భావించారు. కానీ ఊహించని రీతిలో స్వల్ప లక్ష్యాన్ని చేదించలేక మళ్ళీ ఓటమి చవిచూసింది. దీంతో ఇక పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ లో జింబాబ్వే చేతిలో ఓటమి పాకిస్తాన్ ను ఎంతో కాలం వెంటాడుతుందని హార్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే ఆ మ్యాచ్ వరల్డ్ కప్ నుంచి పాక్ నిష్క్రమణకు దారి తీసింది అని గుర్తు చేశాడు.. జింబాంబే చేతిలో ఓడి ఇంటి ముఖం పట్టాల్సి వస్తుందని పాకిస్తాన్ కలలో కూడా ఊహించి ఉండదు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: