కోహ్లీ ఇన్నింగ్స్.. దేవుడి పాట : చాపెల్
అయితే మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ జరిగింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి భారత జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ విరోచితమైన ఇన్నింగ్స్ కారణంగానే భారత్కు విజయం వరించింది అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు.. అయితే ఇప్పుడు ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి జరుగుతున్న చర్చ చూస్తే దాయాదులు పోరుకు మరి ఇంత క్రేజ్ ఉందా అని అనిపించక మానదు. ఎందుకంటే ఈనెల 23వ తేదీన ఈ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ తర్వాత ఇంకా మ్యాచ్ లు జరుగుతూనే ఉన్నాయి కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఈ దాయాదులు పోరు గురించి చర్చ జరుగుతుంది. అయితే ఇక ఈ మ్యాచ్ సాగిన దాని గురించి, మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి ఇప్పటికి ఎంతో మంది మాజీలు స్పందిస్తు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇటీవల ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్రేగ్ చాపెల్ సైతం విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.. విరాట్ కోహ్లీ కంప్లీట్ బ్యాటర్, పాకిస్తాన్ పై విరాట్ ఇన్నింగ్స్ దేవుడి పాటల అనిపించింది. ఇంతవరకు టి20 ఫార్మాట్లో ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ చూడలేదు. నేను క్రికెట్ చూస్తున్నప్పటి నుంచి కూడా ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అని చెప్పడంలో సందేహం లేదు . కోహ్లీ ఇన్నింగ్స్ చూశాక టి20 ఫార్మాట్ ను ఎవరు తక్కువ అంచనా వేయలేరు అంటూ గ్రేగ్ చాపెల్ వ్యాఖ్యానించాడు.