కోహ్లీ ఇన్నింగ్స్ పై.. ఎట్టకేలకు స్పందించిన రోజర్ బిన్ని?
అయితే ఈనెల 23వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి ఎవరో ఒకరు మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ తో చెలరేకాడు.. అయితే ఇప్పుడు వరకు ఎంతో మంది అభిమానులు మాజీ ఆటగాళ్లు ప్రత్యర్థి ప్లేయర్లు కూడా కోహ్లీ ఇన్నింగ్స్ పై స్పందించగా.. ఇక ఎట్టకేలకు ఇదే విషయంపై బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్ని కూడా స్పందించాడు.
విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఒక కలలాంటిది.. ప్రేక్షకులకు ఒక ట్రీట్ లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఇన్నింగ్స్ అసాధారణమైనది. మైదానం నలమూలల అలవోకగా బంతిని తరలించాడు.. కోహ్లీ లాంటి ప్లేయర్లు ఒత్తిడిలో మెరుగైన ఆట తీరు కనబరుస్తారు. ఇక పాకిస్తాన్ పై ఇండియా విజయం ఎంతో గొప్పది అంటూ రోజర్ బిన్ని వ్యాఖ్యానించాడు. భారత్ పై పాక్ గెలుస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో కోహ్లీ వల్ల మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చిందని చెప్పుకొచ్చాడు.