ఆఫ్రిది రికార్డ్ సమం చేసిన "బేబీ డివిలియర్స్"... కేవలం 35 బంతుల్లో ?

VAMSI
దక్షిణాఫ్రికాకు చెందిన రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్ డివాల్డ్ బ్రెవిస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్న వయసులోనే సంచలన షాట్ లు ఆడి, తమ దేశంలోనే ఉన్న ఎబి డివిలియర్స్ ను గుర్తు చేశాడు. మెన్ అండర్ 19 ప్రపంచ కప్ 2022 లో గుర్తుండిపోయే కొన్ని ఇన్నింగ్స్ లను ఆడాడు. ఆ టోర్నీలో తన బ్యాటింగ్ కు ముగ్ధులు అయిన ఇండియా ప్రీమియర్ లీగ్ లోని ముంబై ఇండియన్స్ టీం అతని వేలంలో కొనుక్కుంది. కానీ మొన్న జరిగిన సీజన్ లో బ్రెవిస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని లీగ్ లలో ఆడి కొంత అనుభవం మరియు బ్యాటింగ్ లో టెక్నిక్ లను అలవర్చుకున్నాడు.

అలా సంపాదించిన అనుభవంతో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సీఎస్ఏ ఛాలెంజ్ టీ 20 లో చెలరేగి ఆడుతున్నాడు. ఈ టోర్నీలో టైటాన్స్ తరపున ఆడుతున్న బ్రెవిస్ ఈ రోజు నైట్స్ తో మ్యాచ్ లో చిచ్చరపిడుగులా ఆడాడు. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ టోర్నీలో బ్రెవిస్ 6 మ్యాచ్ లు ఆడి 156 పరుగులు చేయగా, ఈ రోజు మ్యాచ్ లో బ్రెవిస్ కేవలం 57 బంతుల్లో 162 పరుగులు చేశాడు. ఇతని ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు మరియు 13 సిక్సర్లు ఉన్నాయి. బ్రెవిస్ తన సెంచరీని కేవలం 35 బంతులను ఆడి సాధించాడు. గ్రౌండ్ కు అన్ని మూలాల ఆడుతూ బౌలర్లను మరియు ఫీల్డర్లను అల్లాడించాడు. ఏ ఒక్క బౌలర్ ను కూడా వదలకుండా పరుగుల వరద పారించాడు బ్రెవిస్.

ఇతనికి పిల్లే (52) చక్కని సహకారం అందించాడు. ఇది ఒక అనధికారిక టీ 20 మ్యాచ్ అయిపోయింది, కానీ ఎన్నో రికార్డులు చెరిగిపోయేవి. కానీ ఇది ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ సంబరపడిపోయే క్షణం అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: