విరాట్ కోహ్లీ కి.. బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాల్సిందేనట?

praveen
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ గురించి చర్చ ఇంకా సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది అని చెప్పాలి. దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓడిపోవడాన్ని అటు భారత అభిమానులు అందరూ కూడా లైట్ తీసుకున్నారు. ఇక మిగతా మ్యాచ్ లు ఉన్నాయి కదా వాటిల్లో గెలిస్తే చాలు భారత జట్టు సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది అనే ధీమాతో ఉన్నారు టీం ఇండియా అభిమానులు. కానీ అటు పాకిస్తాన్ అభిమానులు మాత్రం భారత ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే భారత్ గెలిస్తే పాకిస్తాన్కు సెమిస్ వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక నచ్చకపోయినా తప్పదు అన్నట్లుగానే భారత్ గెలవాలని కోరుకున్నారు పాకిస్తాన్ అభిమానులు.


 కానీ దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో మాత్రం భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి. ఏకంగా దక్షిణాఫ్రికా ఫేస్ బౌలింగ్ ముందు చేతులెత్తేసి చివరికి ఓటమి చవిచూసింది. అయితే ఇక దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా మరి కొంతమంది ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్ అందరిని అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వదిలేసిన క్యాచ్ గురించి అటు పాకిస్తాన్ అభిమానులు అందరూ కూడా తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. ఏకంగా విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.



 ఎందుకంటే బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ అసాధ్యం అనుకున్న క్యాచులను సైతం అలవోకగా పట్టేయగలడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ పట్టిన అద్భుతమైన క్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఏకంగా చేతుల్లోకి వచ్చిన సులభమైన క్యాచ్ ని విరాట్ కోహ్లీ జార విరచడం అంటే అదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని ఇక క్యాచ్ మిస్ చేసిన తర్వాత అదేదో పొరపాటున జరిగింది అన్నట్లుగా కోహ్లీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తే మాత్రం విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: