ధోని నేర్పిన వ్యూహమే.. టీమిండియాను ఓడించింది : జడేజా
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాజీ కెప్టెన్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నేర్పించిన వ్యూహమే ఇక ఇప్పుడు భారత జట్టును చిక్కులో పడేసింది అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు అజయ్ జడేజా. ఇక ధోని నేర్పించిన వ్యూహం కారణంగానే అటు సౌత్ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ లాంటి ఆటగాళ్లు తెలివైన ప్రదర్శనతో టీమిండియాను ఓడించడంలో సక్సెస్ అయ్యారు అంటూ ఇటీవల అజయ్ జడేజా చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.
ఇటీవల అజయ్ జడేజా ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడాడు. బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ అద్భుతంగా ఆడాడు. అతని షాట్స్ తో ఆటను మరో స్థాయికి తీసుకువెళ్లాడు అంటూ అజయ్ జడేజా ప్రశంసలు కురిపించాడు. అయితే మైదానంలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా కనబడిన డేవిడ్ మిల్లర్ ప్రత్యర్థి తప్పు చేసి చేతికి చిక్కేవరకు ఆటను తెలివిగా ముందుకు తీసుకువెళ్లాడు. నువ్వు తప్పు చేసే వరకు ఎదురు చూస్తాను. నేను మాత్రం తొందరపడి తప్పు చేయను అన్నట్లుగా అతని ప్రదర్శన సాగింది. నిజానికి ఇది క్రికెట్ ప్రపంచానికి ధోని నేర్పించిన పాఠమే. ఇక దానిని వంట పట్టించుకుని తిరిగి మనల్ని దెబ్బ కొట్టారు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు అజయ్ జడేజా.