కోహ్లీ పర్సనల్ వీడియో వైరల్.. లీక్ చేసింది ఎవరో కాదు?
అలాంటి వీడియోనే ఇటీవల సోషల్ మీడియాను షేక్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా విరాట్ కోహ్లీ పర్సనల్ రూమ్ వీడియో లీక్ అయ్యి అది వైరల్ గా మారిపోయింది. కోహ్లీ రూమ్ లో లేని సమయంలో ఇక ఆయన రూమ్ కి సంబంధించిన వీడియో ని రిలీజ్ చేశారు కొందరు ఆకతాయిలు. అది కేవలం క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటనపై అటు విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరి మితిమీరిన అభిమానం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇలాగే మీ బెడ్రూంలో కెమెరాలు పెడితే మీకు ఎలా అనిపిస్తుంది అంటూ ఘాటుగానే స్పందించింది అనుష్క శర్మ.
ఇక దగ్గరకు వచ్చి ఫోటో తీసుకొని ఆటోగ్రాఫ్ తీసుకునే అభిమానులు అంటేనే తనకు ఎంతో ఇష్టం ఇలా దొంగతనంగా రూమ్ లోకి వచ్చిన పర్సనల్ థింగ్స్ చూడాలనుకునే పిచ్చి అభిమానం నాకు వద్దు అంటూ ఫైర్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ రూమ్ వీడియో తీసిన ఎవరో కాదు ఆయన స్టే చేస్తున్న హోటల్ మేనేజర్ అన్న ప్రచారం మాత్రం ప్రస్తుతం ఊపందుకుంది అని చెప్పాలి. ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇదే నిజం అంటూ ప్రస్తుతం ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది. కోహ్లీ స్టే చేస్తున్న హోటల్ మేనేజర్ కోహ్లీకి వీరాభిమానట. ఈ క్రమంలోనే ఆయన ఏం ప్రొడక్ట్స్ వాడతాడు. ఆయన రూమ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారట. ఏదేమైనా ఈ వీడియో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.