ఇండియా vs బంగ్లా మ్యాచ్.. 2016లో ఏం జరిగిందంటే?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన పోరు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ టీమిండియా మధ్య జరగబోతున్న మ్యాచ్ సెమీస్ అవకాశాల కోసం ఇరు జట్లకు కూడా ఎంతో కీలకమైనది. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గత కొన్ని రోజుల నుంచి బంగ్లాదేశ్ టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ లు చూసుకుంటే ఇక అనూహ్యమైన ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తూ వస్తుంది బంగ్లాదేశ్ జట్టు.. ఈ క్రమంలోని నేడు జరగబోయే మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అని ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.


 ఇక నేడు జరగబోయే మ్యాచ్లో ఒకవైపు బంగ్లాదేశ్ కి మరోవైపు టీమిండియా కు అటు బౌలింగ్ విభాగమే ప్రధాన బలం అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ బౌలింగ్ విభాగంతో ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతారో చూసేందుకు అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే టి20 ఫార్మాట్లో భాగంగా ఇప్పుడు వరకు బంగ్లాదేశ్,భారత్ మధ్య 11  సార్లు మ్యాచ్లు జరగగా.. భారత్ పూర్తి ఆదిపత్యాన్ని కొనసాగించింది. ఇప్పటివరకు బంగ్లాదేశ్ పై భారత్ పదిసార్లు విజయం సాధించగా బంగ్లాదేశ్ మాత్రం ఒకే ఒక్కసారి విజయం సాధించడం గమనార్హం.


 అదే సమయంలో ఇక వరల్డ్ కప్ లో భాగంగా 2016లో ఆఖరి సారిగా బాంగ్లాదేశ్, టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇక నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. చివరి ఓవర్లో ఐదు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ రెండు ఫోర్లు కొట్టి ఇక సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే ధోని తన మాస్టర్ మైండ్ కు పని చెప్పాడు. ఇక ఆ తర్వాత మూడు బంతుల్లో భారత్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టింది అని చెప్పాలి. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని సాధించింది టీమిండియా. మరి నేడు ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: