బంగ్లాదేశ్ తో మ్యాచ్.. గెలిస్తే సెమీస్ కి.. ఓడితే పీకల మీదికి?
అయితే భారత బౌలింగ్ విభాగం బాగా రాణిస్తున్న బ్యాటింగ్ విభాగం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది. కీలక సమయాల్లో బ్యాట్స్‌మెన్ లో చేతులెత్తేస్తూ ఉండడం గమనార్హం. అదే సమయంలో గెలవడానికి రాలేదని కేవలం భారత జట్టును ఓడించేందుకు మాత్రమే వచ్చాం అంటూ ఏకంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షెకీబుల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఇక భారత్‌ను ఓడించేందుకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు అన్నది మాత్రం తెలుస్తూ ఉంది. అయితే బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధిస్తే పరవాలేదు. కానీ ఓడితే మాత్రం ఇక భారత జట్టు పీకల మీదికి వస్తుంది అని చెప్పాలి.
ఎందుకంటే ప్రస్తుతం గ్రూప్ 2 లో భారత జట్టు నాలుగు పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇలాంటి సమయంలోనే ఇక బంగ్లాదేశ్ పై గెలిస్తే మరో రెండు పాయింట్లు వచ్చి చేరూతాయ్. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. తద్వారా సమీకరణలు లేకుండా సెమిస్ చేరాలంటే జింబాబ్వేతో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ పై ఓడిపోతే మాత్రం ఇక అటు జింబాబ్వే తో మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ గా మారుతుంది అని చెప్పాలి. జింబాబ్వే పై గెలిచిన సమీకరణలు సెమీస్ అవకాశాలను నిర్ణయిస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఇక టీమిండియాతో సమానంగానే ఆరు పాయింట్లు సాధిస్తుంది.అప్పుడు రన్ రేట్ కీలక పాత్ర వహిస్తుంది అని చెప్పాలి.