నది మధ్యలో కటౌట్.. వారి అభిమానానికి అందరూ ఫిదా?

praveen
సాధారణంగా క్రీడాకారులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలెబ్రిటీలతో పోల్చి చూస్తే క్రీడాకారులకు ఊహించని రీతిలో పాపులారిటీ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే సిని సెలెబ్రిటీలు ఒకే ప్రాంతాల్లో మాత్రమే అభిమానులను సంపాదించుకుంటూ ఉంటారు. మహా అయితే ఇక పక్క రాష్ట్రాలలో అభిమానులను కలిగి ఉంటారు. కానీ అటు క్రీడాకారులు మాత్రం రాష్ట్రం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా కూడా అభిమానులను సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక క్రీడలను ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తూ ఉంటారు కాబట్టి. ఇక తమకు నచ్చిన ఆటగాళ్లను అమితంగా అభిమానించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 అందుకే అటు ఆయా క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లకు సోషల్ మీడియాలో కూడా ఊహించిన రీతిలో పాపులారిటీ ఉంటుంది అని చెప్పాలి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అందరితో పోలిస్తే కాస్త ఎక్కువగానే పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఫుట్బాల్ ప్లేయర్లు లియోనల్ మెస్సి, క్రిస్టియన్ రోనాల్డో మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పాలి. వీరికి ఉన్న క్రేజ్ ఇక ఈ క్రీడా ప్రపంచంలో ఎవరికీలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మిగతా క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లు సైతం వీరిని అమితంగా అభిమానిస్తూ ఉంటారు.  అయితే సాధారణంగా ఇక అభిమానులు తమకు క్రీడాకారులపై ఉన్న అభిమానాన్ని సరి కొత్తగా చాటుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.


 ఇలా అభిమానులు సరికొత్తగా ఏదైనా ప్రయత్నించారు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ఏకంగా అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సికి కేరళలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే ఇటీవల తమ అభిమానాన్ని తెలియజేస్తూ పుల్లపూర్ కు చెందిన మెస్సి అభిమానులు ఏకంగా 30 అడుగుల ఎత్తైన లీయోనల్ మెస్సి కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారు కదా.. సాధారణంగా అందరూ రోడ్ల పక్కన కట్ అవుట్ లో ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అభిమానులు మాత్రం ఏకంగా నది మధ్యలో 30 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయగా ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: