వారెవ్వా.. అందుకే కోహ్లీని రికార్డు రారాజు అనేది?

praveen
విరాట్ కోహ్లీకి రికార్డుల రారాజు అని అభిమానులు అందరూ ఏ ముహూర్తాన పేరు పెట్టారో కానీ ఇక ఈ పేరుకు అసలు సిసలైన అర్థం చెబుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు తన కెరియర్లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే పేజీలు నిండిపోతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమంది లెజెండరి క్రికెటర్లు ఎంతో కష్టపడి క్రియేట్ చేసిన రికార్డులను.. విరాట్ కోహ్లీ అతి తక్కువ సమయంలో అలవోకగా చేదించి తన పేరును లికించుకున్నాడు అని చెప్పాలి. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించి రికార్డుల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు విరాట్ కోహ్లీ.

 ఇక ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ ఇప్పటికీ కూడా తాను కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాడు అన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. ఇంకా ఎక్కువ పరుగులు సాధించి తనను తాను నిరూపించుకోవాలని ఎన్నో రికార్డులు కొలగొట్టాలి అన్న విధంగానే తన ఆట తీరును కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్లో కూడా ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తూ సొగసైన షాట్లతో భారీగా పరుగులు చేస్తూ ఉంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో పరుగులు చేసిన కూడా అతనిలో అలసట మాత్రం అస్సలు కనిపించదు అని చెప్పాలి.

 ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్లో కూడా చెలరేగిపోతున్న విరాట్ కోహ్లీకి ఎన్నో రికార్డులు దాసోహం అంటున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే అటు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు కోహ్లీ 1065 పరుగులు సాధించాడు. అంతేకాదు హైయెస్ట్ యావరేజ్ కూడా కోహ్లీ పేరిటే ఉంది. ఇప్పటివరకు కోహ్లీ యావరేజ్ 88.75 కావడం గమనార్హం. అత్యధిక హాఫ్ సెంచరీలు (15 ),  అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు (7) సాధించిన ప్లేయర్ గా కూడా కోహ్లీ కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: