తన రికార్డు బద్దలు కొట్టడంపై.. జయవర్దనే ఏమన్నాడో తెలుసా?
ఇకపోతే ఇక విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో రికార్డుల వేట కొనసాగిస్తున్న తీరు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఇలా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం ద్వారా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా ఒక ప్రపంచ రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ కంటే ముందు శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేళా జయవర్ధనే పేరిట ఈ రికార్డు ఉండేది. జయవర్ధనే టి20 వరల్డ్ లో ఏకంగా ఒక వెయ్యి 16 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ క్రికెట్లో కొనసాగాడు. కానీ ఇటీవల విరాట్ కోహ్లీ మాత్రం ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక దీనిపై స్పందించిన జయవర్ధనే విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. రికార్డ్ అన్నప్పుడు ఎప్పుడైనా బద్దలు కావాల్సిందే. నా రికార్డు కూడా ఎవరో ఒకరు బ్రేక్ చేయాల్సిందే. అది విరాట్ కోహ్లీ చేశాడు. కంగ్రాట్స్ కోహ్లీ.. నువ్వు ఒక వారియర్ అంటూ ప్రశంసలు కురిపించాడు జయవర్ధనే. కాగా కోహ్లీ ఇప్పటివరకు ఒక వెయ్యి 65 పరుగులు చేశాడు.