పాకిస్తాన్ తో ఇదే లొల్లి.. డెడ్ బాల్ కి ఔట్ ఏంటి సామీ?

praveen
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య   చివరి బంతి వరకు కూడా జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇటీవల సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఎంత ఉత్కంఠ గా సాగింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు అద్భుతంగా రానించింది అని చెప్పాలి. అదే సమయంలో పాకిస్తాన్కు అటు వరుణుడుకూడా ఒకవైపు నుంచి సహాయం అందించాడు అన్న విధంగానే పరిస్థితి మారిపోయింది.



 ఈ క్రమంలోనే వర్షం సహాయం చేయడంతో ఇక పాకిస్తాన్ జట్టు 33 పరుగులు తేడాతో విజయం సాధించి.. ఇక సెమీఫైనల్ వెళ్లే అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. అయితే మ్యాచ్ జయాపజయాల గురించి పక్కన పెడితే పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సమయంలో జరిగిన ఒక విషయం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. పాకిస్తాన్ ఆటగాడు  నవాజ్ తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా చివరికి అతను పొరపాటున వికెట్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా డెడ్ బాల్ కి అతను వికెట్ కోల్పోయాడు.



 ఇంతకీ ఏం జరిగిందంటే.. బౌలర్ వేసిన బంతి నవాజ్ బ్యాట్ కు తగిలిన తర్వాత అతని ప్యాడ్ కు తగిలింది. అయితే బౌలర్ అప్పిల్ చేయడంతో అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. అయితే దీంతో నవాజ్ ఎల్బిడబ్ల్యుగా అవుట్ అయ్యాడు. అయితే రివ్యూ కోసం వెళ్లవచ్చు అనే ఉద్దేశంతో పరుగు కోసం ప్రయత్నించాడు నవాజ్. ఈ క్రమంలోనే అతను రన్ అవుట్ అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అంపైర్ రన్ అవుట్ ఇచ్చాడని అతను భావించాడు. కానీ అంపైర్ అతనికి ఎల్బిడబ్ల్యూ అవుట్ గా ప్రకటించాడు. ఈ సందర్భంలో నవాజ్ సమీక్షకు వెళ్లి ఉంటే వికెట్ కాపాడుకునేవాడు. ఎందుకంటే క్రికెట్ నిబంధనలకు కోణంలో చూస్తే అది డెడ్ బాల్ అని చెప్పాలి. కానీ రివ్యూ తీసుకోకుండానే అతను వెళ్ళిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: