అయ్యో పాపం.. పాక్ కు మరో ఇండియానే దిక్కయింది?
మొదటి మ్యాచ్ లో ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ఇక రెండవ మ్యాచ్లో పసికూన గా ఉన్న జింబాబ్వే చేతిలో కూడా ఓటమి చవిచూసింది. దీంతో సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి అని చెప్పాలి. దీంతో పాకిస్తాన్ ఇంటికి పోవడం ఖాయం అనుకున్నారు. అయితే ఇలా సెమీస్ అవకాశాలు కష్టతరమైన సమయంలో పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా సహా మిగతా రెండు జట్లపై విజయం సాధిస్తే పాక్ సెమిస్ చేరుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత కష్టతరంగా మారిపోయాయి.
అయితే రెండు ఓటమిల తర్వాత వరుసగా రెండు భారీ విజయాలు సాధించిన పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కానీ మరోసారి పాకిస్తాన్ కు టీమిండియానే దిక్కు అయింది. ఎందుకంటే సఫారీల మీద గెలిచిన పాకిస్తాన్ కు సెమిస్ అవకాశాలు అంతంత మాత్రం గానే ఉన్నాయి. జింబాబ్వేత్తో మ్యాచ్లో టీమిండియా ఓడిపోయి సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడితేనే పాకిస్తాన్ కు సెమీస్ ఛాన్స్ ఉంటుంది అని చెప్పాలి. ఈ రెండు మ్యాచ్ లలో ఏ జట్టు విజయం సాధించిన లేదా ఏ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన పాకిస్తాన్ ఇంటికి వెళ్లక తప్పదు.