వారెవ్వా.. పగోడి గడ్డపై కూడా.. మనోడిదే హవా?
ఏకంగా విదేశీ ఆటగాళ్లు మాత్రమే కాదు ఆస్ట్రేలియా ప్లేయర్లు సైతం ఇక స్వదేశీ పరిస్థితులను తట్టుకొని మంచి బ్యాటింగ్ చేయలేకపోతున్నారు చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు విరాట్ కోహ్లీ మాత్రం ఆస్ట్రేలియాలో ఉన్న బౌన్సీ పిచ్ లపై తన బ్యాట్ తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో భాగంగా భారత్ నాలుగు మ్యాచ్లు ఆడగా విరాట్ కోహ్లీ ఈ నాలుగు మ్యాచ్ లలో కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భీకరమైన ఫామ్ కొనసాగిస్తూ ఏకంగా బౌలర్లకు సింహస్వప్నంల మారిపోయాడు అని చెప్పాలి.
ఇలా పగోడీ గడ్డమీద కూడా మనోడే హవా కొనసాగిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ఆస్ట్రేలియా తో ఆడాలన్న.. అక్కడి బౌన్సీ పిచ్ లపై అడుగు పెట్టాలన్నా కూడా ప్రత్యర్థి జట్లు ఆలోచిస్తాయి. కానీ విరాట్ కోహ్లీకి మాత్రం ఈ రూల్ వర్తించదు అని చెప్పాలి. ఏకంగా ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా క్రికెటర్లకే అందని రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డమీద ఏకంగా 14 మ్యాచ్లలో 8 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కు మాత్రం ఇలా ఎనిమిది హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడానికి ఏకంగా సొంత గడ్డ మీదే 43 మ్యాచులు పట్టడం గమనార్హం. దీన్నిబట్టి విరాట్ కోహ్లీ ఎంతలా విధ్వంసం సృష్టిస్తాడో అర్థం చేసుకోవచ్చు.