పోలీస్ స్టేషన్ కు ధోని.. మొత్తానికి అతనిపై కేసు వేశాడుగా?
లేదంటే ఇక తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అందరితో పోల్చి చూస్తే ధోని మాత్రం కాస్త భిన్నమైన వాడు. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఇక యా క్టివ్ గా మాత్రం అస్సలు ఉండడు. అయితే ధోని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకపోయినప్పటికీ ధోని గురించిన వార్తలు మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాయి అని చెప్పాలి. ధోని గురించి ఏ చిన్న విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన అతి సెన్సేషన్ సృష్టిస్తుంది అని చెప్పాలి.
ఇప్పుడు ధోని గురించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కారు. సంపత్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ధోని పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం. అయితే గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సంపత్ ధోనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ధోని పై విమర్శలు చేయొద్దంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా.. సంపత్ కుమార్ మాత్రం అతని తీరు మార్చుకోకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే విసిగిపోయిన మిస్టర్ కూల్ ధోని అతనిపై కేసు వేసినట్లు తెలుస్తోంది.