హమ్మయ్యా.. 27 ఇన్నింగ్స్ ల తర్వాత.. ఎట్టకేలకు?
ఇలా అంచనాలను అందుకోలేక పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన స్టార్ బాట్స్ మెన్ లలో అటు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్రౌండర్ గ్లేన్ మాక్స్వెల్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఈ ఏడాది వరల్డ్ కప్ లో అతను ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. వరల్డ్ కప్ లో మాత్రమే కాదు గత 27 ఇన్నింగ్స్ లో ఒక్క అర్థ సెంచరీ కూడా సాధించలేదు అని చెప్పాలి. కానీ ఎట్టకేలకు ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం కీలక హాఫ్ సెంచరీ సాధించి అభిమానులు అందరిని కూడా హమ్మయ్య అనుకునేలా చేసాడు.
ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 29 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్నాడు మాక్స్ వెల్. ఇందులో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లు ఉండడం గమనార్హం. మొత్తంగా 32 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో విధ్వంసకర ఆల్రౌండర్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ గత 27 ఇన్నింగ్స్ లో ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ చేయలేదు మాక్స్ వెల్. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతో నిరాశలో మునిగిపోయారు. కానీ ఇప్పుడు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించింది.