పాపం ఆస్ట్రేలియా.. జాలి పడుతున్న క్రికెట్ ఫ్యాన్స్?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు మరో కీలకమైన పోరు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. శ్రీలంక ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో శ్రీలంక గెలిచినప్పటికీ ఆ జట్టుకు వచ్చే ఫలితం మాత్రం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. కానీ ఇంగ్లాండ్ మాత్రం సెమీఫైనల్ లో అవకాశాలు దక్కించుకోవాలంటే మాత్రం తప్పక గెలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పాలి. అదే సమయంలో శ్రీలంక ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మ్యాచ్ పైనే అటు ఆస్ట్రేలియా భవితవ్యం  కూడా ఆధారపడి ఉంది అని చెప్పాలి.

 అయితే ఇటీవలే జరిగిన ఆప్ఘనిస్తాన్తో మ్యాచ్లో గెలిచి సెమిస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ఆస్ట్రేలియా జట్టు. కాగా నేడు జరగబోయే మ్యాచ్ లో ఇంగ్లాండ్  ను శ్రీలంక ఓడించింది అంటే నేరుగా ఆస్ట్రేలియా సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది. కానీ పాపం ఆస్ట్రేలియాకు మాత్రం సెమీఫైనల్ చేరాలి అన్న ఆశ కేవలం ఆశగానే మిగిలిపోతుంది అన్నది తెలుస్తుంది.  ఎందుకంటే ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ శ్రీలంక బలాబలాలు చూసుకుంటే శ్రీలంక కంటే అటు ఇంగ్లాండ్ జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పటి వరకు పాత గణంకాలు చూసుకుంటే శ్రీలంకపై పూర్తి అధిపత్యాన్ని కొనసాగించింది ఇంగ్లాండ్.

 దీన్ని బట్టి చూస్తే నేడు జరగబోయే మ్యాచ్లో ఎంత ఉత్కంఠ భరితమైన పౌరు జరిగినప్పటికీ అటు ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో ఇక ఆస్ట్రేలియా శ్రీలంక విజయం సాధిస్తుందని ఎన్ని ఆశలు పెట్టుకున్నా చివరికి నిరాశ తప్పదు అని మాత్రం పక్కాగా చెబుతూ ఉన్నారు. ఇక ఈ విషయం గురించి తెలిసిన ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు పాపం ఆస్ట్రేలియా.. సొంత గడ్డపై టి20 ప్రపంచ కప్ జరిగిన కూడా సెమిస్ చేయకుండానే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి అంటూ కామెంట్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: