వరల్డ్ కప్ గెలిస్తే.. అలా చేస్తా.. మనసులో మాట బయట పెట్టిన కోహ్లీ?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ఎంత మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఒత్తిడిని సైతం చిత్తు చేస్తూ తన బ్యాటింగ్ తో చెలరేగిపోతూ ఉన్నారు విరాట్ కోహ్లీ. ఇక ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ తన పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా విరాట్ కోహ్లీ పుట్టినరోజుకు సంబంధించిన పోస్టులే దర్శనమిచ్చాయి. అభిమానులు, ప్రేక్షకులు, మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత ఆటగాళ్లు అందరు కూడా విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అని చెప్పాలి. ఇకపోతే విరాట్ కోహ్లీ  జింబాబ్వే తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు. ఈ సందర్భంగా మైదానంలోనే భారత్కు చెందిన జర్నలిస్టులు అటు విరాట్ కోహ్లీతో కేక్ కట్ చేయించారు.


 ఈ సందర్భం గా విరాట్ కోహ్లీని జర్నలిస్టులు పలు ఆసక్తికర ప్రశ్నలు అడగగా.. కోహ్లీ కూడా వారికి ఎంతో నవ్వుతూనే సమాధానాలు చెప్పాడు అని చెప్పాలి. అదే సమయం  లో ఇలా జర్నలిస్టులతో ముచ్చటిస్తున్న సమయం లో తన మనసు లోని మాట బయట పెట్టాడు విరాట్ కోహ్లీ. జర్నలిస్టులతో మాట్లాడుతూ ఇప్పుడు మీతో చిన్న కేక్ కట్ చేస్తున్నాను. కానీ నవంబర్ 13వ తేదీన పెద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. నవంబర్ 13వ తేదీన టీం ఇండియా ఫైనల్ లో వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది. అందుకే సంబరాలు చేసుకుంటాను అంటూ విరాట్ కోహ్లీ ఇన్ డైరెక్టుగా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: