ఏం టాలెంట్ సామీ నీది.. గిన్నిస్ రికార్డ్.. కీహోల్ నుంచి ఏడు బాణాలు?
అయితే ఇలా బుల్స్ ఐ మీదికి బాణం విసిరితేనే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా బాణాలను విసిరిన తీరు గురించి తెలిస్తే మాత్రం ఫిదా అవ్వకుండా ఉండలేరు అని చెప్పాలి. ఏకంగా ఒక చిన్న బెజ్జంలో నుంచి బాణాలను సందించగల టాలెంట్ను బయటపెట్టి ప్రస్తుతం అరుదైన రికార్డ్ను సృష్టించాడు. ఇక అందరూ ఉపయోగించే సాంప్రదాయ ఓట్టో మాన్ విల్లును ఉపయోగించి 30 అడుగుల దూరంలో ఉండి అది కూడా కేవలం ఒక సెంటీమీటర్ సైజు ఉన్న తాళం చెవి హోల్ లో నుంచి అలవోకగా ఏడు బాణాలను వెంటవెంటనే సందించాడు.
అయితే ఇలా తాళం చెవి సందులో నుంచి దూరగలిగేందుకు వీలుగా ఈకలు లేని కార్బన్ బాణాలను ఉపయోగించాడు సదరు వ్యక్తి. ఇలా కీ హోల్ లో నుంచి వరుసగా అత్యధిక బాణాలను సంధించిన వ్యక్తిగా సరికొత్త గిన్నిస్ రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. కాగా అండర్ సేన్ ప్రతిభను చూసిన నేటిజన్లు నోరేళ్ల పెడుతున్నారు.. ఇది ఎలా సాధ్యమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విలువిద్యకు పూర్వ వైభవం తెచ్చే ఉద్దేశంతోనే తాను ఈ తరహా ప్రయోగాలు చేస్తూ ఉన్నాను అంటూ సదరు వ్యక్తి చెప్పుకొస్తున్నాడు..