కెప్టెన్ గా రోహిత్ శర్మ.. ప్రపంచ రికార్డు కొట్టేసాడుగా?

praveen
ఎవరు ఊహకంగాని రీతిలో అటు విరాట్ కోహ్లీ టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలో ఇక జట్టులో సీనియర్ ఆటగాడిగా అత్యుత్తమ ప్లేయర్గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే రోహిత్ శర్మ కెప్టెన్గా ఎంపికైన నాటి నుంచి అటు టీమిండియా ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉంది.


 ముఖ్యంగా టి20 ఫార్మాట్లో అయితే ప్రత్యర్థులపై పూర్తి ఆదిపత్యాన్ని చలాయిస్తూ తిరుగులేదు అని నిరూపిస్తుంది టీమ్ ఇండియా జట్టు. భారత జట్టు విదేశీ పర్యటనకు వెళ్లిన లేదా విదేశీ జట్లు భారత పర్యటనకు వచ్చిన అటుసిరీస్ గెలిచేది మాత్రం భారత జట్టే అన్న విధంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటివరకు విన్నింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగానే ఉండడం గమనార్హం . ఇక వరల్డ్ కప్ లో కూడా తనదైన కెప్టెన్సీ తో ప్రస్తుతం జట్టును ముందుకు నడిపిస్తూ వరుస విజయాలను అందిస్తున్నాడు రోహిత్ శర్మ.


 ఏకంగా వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 12 మ్యాచ్లలో ఆడిన ఐదు మ్యాచ్ లలో కూడా నాలుగింటిలో విజయం సాధించింది. ఇక ఇటీవల జింబాబ్వేపై విజయం సాధించడం ద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మకు అరుదైన రికార్డు ఖాతాలో వచ్చి పడింది. ఒక ఏడాదిలో అత్యధిక టి20 విషయాలు అందుకున్న సారధిగా రోహిత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2021 లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ 20 విజయాలు అందుకోగా.. ఒక ఇప్పుడు బాబర్ ను వెనక్కు నెట్టి భారత కెప్టెన్ రోహిత్ శర్మ 21 విజయాలతో తొలి స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో 2018లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ కాన్ 18 టీ20 విజయాలు, 2016 లో ఎంఎస్ ధోని 15 టీ20 విజయాలతో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: