జింబాబ్వే పై విజయం.. అరుదైన రికార్డు సృష్టించిన భారత్?

praveen
మునుపెన్నడు లేని విధంగా ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టు ఇక ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు వివిధ దేశాల పర్యటనలకు వెళ్లి ఇక అక్కడ మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటి ప్రత్యర్ది పై ఆదిపత్యం చెలాయించి వరుస సిరీస్ లు గెలుచుకుంది భారత జట్టు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. ప్రత్యర్థి  ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ ఇక అటు ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇటీవలే సూపర్ 12 మ్యాచ్లలో భాగంగా జింబాబ్వే తో జరిగిన మ్యాచ్లో మరోసారి భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. పటిష్టమైన పాకిస్తాన్ ను ఓడించిన జింబాబ్వే జట్టు ను తక్కువ అంచనా వేయకుండా.. తమదైన వ్యూహాలతో బరిలోకి దిగిన భారత జట్టు అందరూ ఊహించినట్లుగానే ఆదిపత్యం చెలాయించింది అని చెప్పాలి. ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్ లో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించింది. ఈ క్రమంలోనే ఏకంగా పసికూన జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం.

 అదే సమయంలో టి20 వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టి20 లలో జింబాబ్వే ఇక ఇటీవల జరిగిన మ్యాచ్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. 2015లో జింబాబ్వేత జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఇదే జింబాబ్వేపై అత్యధిక స్కోరుగా కొనసాగింది. ఇక ఇటీవల మ్యాచ్లో మాత్రం 186 పరుగులు చేసి అత్యధిక స్కోరును నమోదు చేస్తుంది. ఇక ఇందులో సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులతో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఇక మొత్తంగా మ్యాచ్లో 71 పరుగులతో టీమిండియా విజయం సాధించగా.. సూర్య కుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: