వావ్.. చరిత్ర సృష్టించిన కోహ్లీ?
మొన్నటికి మొన్న బ్యాటింగ్ వైఫల్యంతో కొన్నాళ్లపాటు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో విమర్శలను కూడా చవిచూశాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మరోసారి మునుపటి ఫామ్ ను అందుకున్న విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇక ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రపంచకప్ లో కూడా అసమాన్యమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే విరాట్ కోహ్లీ తన కెరీయర్ లోనే మొదటిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నాడు.
అయితే ఇలా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ ఒకసారి కొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. క్రికెట్ చరిత్రలోనే పది ఐసీసీ అవార్డులను గెలుచుకున్న ఏకైక క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పుడు వరకు ఏ క్రికెటర్ కూడా ఐసీసీ ఇచ్చిన 10 అవార్డులను అందుకోలేదు. ఇక విరాట్ కోహ్లీ సాధించిన ఈ అరుదైన ఫీట్ తో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. నవంబర్ పదవ తేదీన ఇంగ్లాండు తో టీమ్ ఇండియా సెమి ఫైనల్ మ్యాచ్ ఆడకుండా విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.