సెమీఫైనల్ : ఆ లెక్కన చూస్తే.. ఇండియా ఫైనల్ వెళ్లినట్లే?

praveen
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 12 మ్యాచ్ లలో వరుసగా విజయాలతో దూసుకుపోయిన టీమ్ ఇండియా జట్టు ఇప్పుడు కీలకమైన సెమీఫైనల్ పోరుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ 10వ తేదీన ఇంగ్లాండ్ టీమిండియా మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధించి ఇక విజయ డంకా మోగిస్తారు అన్న విషయం తెలుసుకోవడానికి  అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా అటు ఆస్ట్రేలియాలో భారీ వర్షాల కారణంగా ఎన్నో మ్యాచులు రద్దు అవుతాయి. ఇక ఈ మ్యాచ్ లు రద్దు కావడం కారణంగానే కొన్ని జట్లు పాయింట్లు కోల్పోయి ఇక సెమి ఫైనల్ కు చేరకుండానే ఇంటి బాట పట్టాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అటు నవంబర్ 9, 10 తేదీలలో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ లకి వర్షపు ముప్పు ఉంది అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ భారత్ మధ్య జరగబోయే మ్యాచ్లో ఇక వర్షం వచ్చి మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 ఇలాంటి సమయంలోనే అటు టీమ్ ఇండియా అభిమానులు మాత్రం మ్యాచ్ రద్దు అయితే బాగుండు అని కోరుకుంటున్నారు అని చెప్పాలి ఎందుకంటే వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే రిజర్వు డే రోజు మ్యాచ్ నిర్వహిస్తారు ఎంపైర్లు. ఒకవేళ రిజర్వు డే రోజు కూడా వర్షం పడింది అంటే ఇక చివరికి మ్యాచ్ రద్దు చేస్తారు. ఇక అప్పుడు పాయింట్లు పట్టికలో టాప్ లో ఉన్న జట్టు  ఫైనల్ అడుగుపెడుతుంది.  ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం గ్రూప్ 2 లో పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది భారత్  ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఎలాంటి పోటీ లేకుండానే ఏకంగా ఫైనల్లో అడుగుపెడుతుంది భారత్. అందుకే మ్యాచ్ రద్దుకావాలని కోరుకుంటున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: