వావ్.. '360 డిగ్రీస్' సీక్రెట్ బయటపెట్టిన సూర్య కుమార్?
ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ అంత అలవోకగా మిగతా బ్యాట్స్మెన్ లకు ఎవరికి సాధ్యం కాని రీతిలో ఎలా 360 డిగ్రీస్ లో షాట్ లు కొట్టగలుగుతున్నాడు అని అనుమానం అందరిలో ఉండవచ్చు. ఇక ఇటీవల తన 360 డిగ్రీస్ బ్యాటింగ్ గురించిన రహస్యాన్ని బయట పెట్టాడు సూర్య కుమార్ యాదవ్. బిసిసిఐ టీవీలో అశ్విన్ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పుడు రబ్బర్ బాల్ తో ఆడేటప్పుడు స్కూప్ షాట్లు కొట్టడంలో మాస్టర్ అయ్యానని తెలిపాడు. అయితే అలాంటి షాట్లు ఆడేటప్పుడు బౌలర్ ఎలాంటి బాల్ వేస్తున్నాడు.. ఏం ఆలోచిస్తున్నాడు పసిగెట్టాలి. ఫీల్డర్లు ఎక్కడున్నారు బౌండరీ లైన్ ఎంత దూరంలో ఉందో ముందుగా గమనించాలి.
ఆస్ట్రేలియాలో గ్రౌండ్స్ 80 నుంచి 85 మీటర్లు ఉంటాయి. స్క్వేర్ బౌండరీ 75 నుంచి 80 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక అదే వికెట్ల వెనకాల అయితే 60 నుంచి 65 మీటర్లు ఉంటుంది. కాబట్టి నేను ఆ దిశగానే షాట్స్ ట్రై చేసి సక్సెస్ అవుతున్న.. చిన్నప్పుడు నేను రబ్బర్ బాల్ క్రికెట్ ఆడే వాడిని.. నా స్నేహితుడు తడి బంతితో 18 గజాల నుంచి ఫాస్ట్ గా బౌలింగ్ చేసేవాడు. అప్పుడే ఆ షాట్లు ఆడటం నేర్చుకున్న అంతే తప్ప వీటి కోసం స్పెషల్గా నెట్స్ లో ప్రాక్టీస్ చేయలేదు. ఇవి 360 డిగ్రీస్ లో కొట్టడం నాకు అడ్వాంటేజ్ గా మారిపోయింది అంటూ సూర్య కుమార్ యాదవ్ తన సీక్రెట్స్ అన్ని కూడా రివీల్ చేసేసాడు.