వైరల్ : నిజంగా.. పంత్ ఎంత త్యాగం చేశాడబ్బా?
అయితే అభిమానులు కోరుకున్నట్లుగా తుది జట్టులోకి అయితే వచ్చాడు. కానీ అతని బ్యాట్ నుంచి అభిమానులు కోరుకున్న ప్రదర్శన మాత్రం రాలేదు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సింగిల్ డిజిట్ స్కోర్కె పరిమితం అయి పెవిలియన్ చేరిన రిషబ్ పంత్ ఇక ఇటీవల కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా ఆరు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. దీంతో కొంతమంది అటు రిషబ్ పంత్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూ ఉండగా మరికొంతమంది మాత్రం అటు రిషబ్ పంత్ ఏకంగా జట్టు గెలుపు కోసం చేసిన త్యాగాన్ని గురించి మాట్లాడుతూ అందుకు సంబంధించిన వీడియో ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉండడం గమనార్హం.
ఇలా ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే మాత్రం రిషబ్ పంత్ జట్టు కోసం ఎలాంటి త్యాగం చేశాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది అంటూ పంత్ అభిమానులు అంటున్నారు. ఇండియా ఇన్నింగ్స్ సమయంలో జోర్డాన్ వేసిన చివరి ఓవర్ లో మూడో బంతిని అవుట్ సైడ్ వేయగా పంత్ బ్యాట్ కు తాకలేదు. అయితే పాండ్య మాత్రం సింగిల్ కోసం సగం పిచ్ దాటేసాడు. ఇక నాన్ స్ట్రైక్ ఎండ్ కు వెళ్లడం ఇష్టం లేక పాండ్యా ముందుకు కదలాడు. ఇది గమనించిన పంత్ తాను అవుట్ అయిన పర్వాలేదు హార్దిక్ పాండ్యా క్రీజు లో ఉండాలని భావించి నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు పరిగెత్తాడు. ఇక ఆలోపే బట్లర్ బంతిని అందుకొని వికెట్లకు త్రో చేయడంతో పంత్ రన్ అవుట్ గా వెనుతిరిగాడు.