టీమిండియా ఓటమి.. వాళ్ళిద్దరూ ఉండి ఉంటేనా?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా అభిమానుల అంచనాలను తారుమారు చేస్తూ టీమ్ ఇండియా ఘోరంగా ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని అటు అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.  లీగ్ దశలో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా సెమి ఫైనల్లో ఎందుకు ఇలాంటి ప్రదర్శన చేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక మరి కొంతమంది ఇలాంటి ప్రదర్శన చేస్తే టీమిండియా అదృష్టవశాత్తు ఫైనల్ కు వెళ్లిన అక్కడ ఓటమి చవిచూడక తప్పదు అంటూ  కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.


 అయితే ఎంతో పటిష్టమైన టీమిండియా ఓడిపోవడానికి కారణం ఏంటి అన్న విషయంపై అటు విశ్లేషకులు కూడా ఎన్నో రివ్యూలు ఇస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే మరో కొత్త విషయం తెరమీదకి తీసుకోవచ్చారు.  వరల్డ్ కప్ ముందు వరకు కూడా జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగిన స్టార్ బౌలర్ బుమ్రా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ జట్టులో లేకపోవడంతో టీమిండియా ప్రణాళికలు మొత్తం తారుమారు అయిపోయాయి.


 అయినప్పటికీ టీమిండియా వరల్డ్ కప్ లో ఇక తమకు ఉన్న బలంతోనే ప్రత్యర్థులను ఢీకొడుతూ వరుస విజయాలు సాధించింది. కానీ  కీలకమైన సెమీఫైనల్ పోరులో ఓడిపోవడంతో ఒకవేళ జట్టులో బుమ్రా, రవీంద్ర జడేజా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది మన చర్చ తెరమీదికి వచ్చింది. ఎందుకంటే టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బుమ్రా ఉండి ఉంటే ఇక అటు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించేవాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఇక బ్యాటింగ్ వైఫల్యం ఉన్నప్పుడు ఎన్నోసార్లు రవీంద్ర జడేజా వచ్చి ఆదుకున్నాడు. ఇక జడ్డు ఉండి ఉంటే టీమ్ ఇండియా స్కోర్ 200 దాటేదేమో అని అంచనా వేస్తున్నారు మరి కొంతమంది విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: