జట్టులో మళ్లీ వారి ముఖాలు చూడాలని లేదు : సెహ్వాగ్

praveen
ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా జట్టు సెమి ఫైనల్ లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశలో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా జట్టు అతి కష్టం మీద సెమీఫైనల్ అవకాశం దక్కించుకుంది. ఇంగ్లాండ్ మీద ఎంతో అలవోకగా విజయం సాధిస్తుందని టీమిండియా అభిమానులందరూ కూడా గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. కానీ అందరి నమ్మకాన్ని వమ్ము చేసింది టీమిండియా.


 టీమిండియా లాంటి మేటి జట్టు ఇంగ్లాండుకు కనీస పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. ఏకంగా ఇంగ్లాండ్ జట్టుకు పసికూన జట్లు ఇచ్చిన పోటీ కూడా టీమిండియా ఇవ్వలేక తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. అయితే ఈ ఓటమిని అటు భారత అభిమానులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు కూడా అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై, ఇక జట్టులో ఉన్న ఆటగాళ్లపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇదే విషయం పై స్పందించిన మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భవిష్యత్తులో జరిగే టి20 ప్రపంచ కప్ లో టీమిండియా విజేతగా నిలవాలంటే జట్టు ప్రక్షాళన ఇప్పుడే మొదలు పెట్టాలి అంటూ వ్యాఖ్యానించాడు. కచ్చితంగా భారత జట్టులో మార్పులు ఉండాలని కోరుకుంటున్నాను.. కొంతమందిని మళ్ళీ జట్టులో చూడాలని అస్సలు అనుకోవడం లేదు. 2007 టీ20 ప్రపంచ కప్ ముందు కూడా భారత జట్టులో ఇదే పరిస్థితి. దిగ్గజ ఆటగాళ్లతో ఎక్కువమంది వరల్డ్ కప్ లో ఆడలేదు. జట్టు నిండా కుర్రాల్లే. వచ్చే ప్రపంచం నాటికల్లా టీమిండియా కూడా అలా కుర్రాళ్ళతో నింపాలి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: