పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ .. అరుదైన రికార్డ్?

praveen
ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసిందో  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ చూశారు. కనీసం సెమి ఫైనల్ కూడా చేరుకుండానే సూపర్ 12 దశ నుంచే ఇంటి దారి పడుతుంది అనుకున్న పాకిస్తాన్ ఊహించని రీతిలో అనూహ్యమైన ప్రదర్శనతో సెమి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే సెమీఫైనల్ లోకి రావడమే కాదు అప్పటి వరకు వరుస విజయాలతో దూసుకు వచ్చిన న్యూజిలాండ్ ను సైతం మట్టి కనిపించి ఫైనల్లో కూడా అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఫైనల్ లో పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా మాత్రమే సరిపెట్టుకున్నప్పటికీ అటు ఫైనల్ మ్యాచ్లో  చిత్తుగా ఓడిపోతుంది అనుకున్న పాకిస్తాన్ జట్టు కనబరిచిన పోరాటపట్టిన మాత్రం అందరిని ఆకట్టుకుంది అని చెప్పాలి.. తక్కువ టార్గెట్ ను కాపాడుకునేందుకు అటు పాకిస్తాన్ బౌలర్లు అద్భుతమైన పోరాటం చేశారు. కానీ చివరికి అదృష్టం మాత్రం ఇంగ్లాండ్ కి కలిసి వచ్చి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టులో కీలకమైన ఆల్రౌండర్ గా ఎదుగుతున్న షాదబ్ ఖాన్ ఒక అరుదైన రికార్డు సర్వస్టించాడు..

 పాకిస్తాన్ జట్టు తరఫున టీ20 ఫార్మాట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షాదాబ్ ఖాన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏకంగా టి20 ఫార్మాట్లో పాకిస్తాన్ తరఫున 98 వికెట్లు తీసాడు షాదాబ్ ఖాన్. అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారి బ్రూక్స్ వికెట్ తీశాడు. తద్వారా ఈ రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది (97) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి సరి కొత్తగా తన పేరును లిఖించుకున్నాడు . బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా అదరగొడుతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: