ఆ కండిషన్ పెడితే.. అప్పుడు బాగా ఆడతారు : గవాస్కర్

praveen
ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో భాగంగా అటు సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత జట్టు ఘోర ఓటమి చవిచూడటాన్ని భారత్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ ముగిసినప్పటికీ కూడా ఇక ఈ విషయంపై చర్చించుకుంటూనే ఉన్నారు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లో భాగంగా అటు ఆటగాళ్లు ఎంతో ఒత్తిడితో కూడిన ప్రదర్శన చేయడంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

 ఈ క్రమంలోనే అటు బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి కూడా మాజీ ప్లేయర్స్ అయినా సునీల్ గవాస్కర్ సహా మరి కొంతమంది కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ ఆడేటప్పుడు విశ్రాంతి అవసరం లేదు. కానీ అదే భారత జట్టు తరఫున ఆడేటప్పుడు మాత్రం విశ్రాంతి కావాలా.. బీసీసీఐ తీరు ఏమాత్రం బాగాలేదు అంటూ గతంలోనే బిసిసిఐ పై విమర్శలు గుప్పించారు  అన్న విషయం తెలిసిందే. ఇండియా ఓటమి చవి చూడడంతో మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది అని చెప్పాలి..

 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంపై స్పందించిన టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ఐపీఎల్ ఆడే సమయంలో లేని ఒత్తిడి దేశం కోసం ఆడేటప్పుడు ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించాడు. వారిని జట్టులో ఎంపిక చేయడమే కాకుండా ఇక వారికి వేతనాలు కూడా ఇస్తున్నారు. ఒకవేళ పని ఒత్తిడి కారణంగా ఎవరైనా ఆటగాడు ఆడక పోతే ఇక అతనికి చెల్లిస్తున్న మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని షరతును తీసుకువస్తే ప్రతి ఒక్కరు అప్పుడు బాగా ఆడతారని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇకపోతే ఈ లెజెండరి ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా  మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: