కెప్టెన్సీ మార్పు వద్దు.. భిన్నంగా స్పందించిన ఇర్ఫాన్ పఠాన్?

praveen
ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా ఎందుకో ఆశించిన ప్రదర్శన మాత్రం చేయలేదు అన్న విషయం తెలిసిందే. టైటిల్ గెలుచుకొని స్వదేశానికి తిరిగి వస్తుంది అనుకున్నారు అందరూ. కానీ ఊహించని రీతిలో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి నిరాశపరిచింది టీమాండియా జట్టు. సెమీఫైనల్ లాంటి కీలకమైన నాకౌట్ మ్యాచ్లో కనీసం ప్రత్యర్థి ఇంగ్లాండ్కు పోటీ ఇవ్వలేకపోయింది. పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీమిండియా ఓటమి అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు, మాజీ ఆటగాళ్లు. ఇదే విషయంపై చర్చిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే జట్టులో సీనియర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ వెంటనే అప్పగించాలి అంటూ ఎంతో మంది డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.  అంతేకాకుండా సీనియర్లను పూర్తిగా జట్టు నుంచి తప్పించి ఇక టీం మొత్తాన్ని కూడా యువ ఆటగాళ్లతో నిండిపోయేలా చూడాలి అని సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా టీమిండియా సెమీఫైనల్ లో ఓడిపోయిన నాటి నుంచి కూడా కెప్టెన్సీ మార్పుపై చర్చ జరుగుతూనే ఉంది. ఇదే విషయంపై టీం ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 గత కొన్ని రోజుల నుంచి కెప్టెన్ ని మార్చాలి అంటూ డిమాండ్స్ వస్తున్నాయి. అయితే కెప్టెన్ మార్పుపై దయచేసి ఆలోచన చేయొద్దు. ఎందుకంటే అది ఫలితాలు ఇస్తుందని భావించవద్దు అంటూ ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు. జట్టులోనే ఓపెనర్లు ఎంతో దాటిగా ఆడాలని కనీసం ఒక్కరైనా సరే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నించాలి అంటూ సూచించాడు. అంతేకాకుండా వికెట్లు తీసే మనికట్టు స్పిన్నర్ దుర్యోధ్యమైన పాస్ట్ బౌలర్ జట్టులో తప్పనిసరిగా ఉండాలి అంటూ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా కు పలు సూచనలు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: