వార్నర్.. నీ షర్ట్ ఇస్తావా.. చిన్నారి ఫ్యాన్ కోరిక.. డేవిడ్ బాయ్ ఏం చేశాడంటే?

praveen
డేవిడ్ వార్నర్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు. మొన్నటి వరకు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పటికీ ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో మాత్రం మళ్లీ ఫామ్ లోకి వచ్చి 80 కి పైగా ఎక్కువ పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. అయితే మైదానంలో బ్యాట్ తో విధ్వంసం సృష్టించి అటు బౌలర్ల పై వీర విహారం చేసే డేవిడ్ వార్నర్.. అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.  అభిమానులను అల్లరించేందుకు ఎప్పుడు తనదైన శైలిలో ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు.


 ఇకపోతే ఇటీవలే డేవిడ్ వార్నర్  ఒక చిన్నారి అభిమానికి బదులు ఇచ్చిన తీరు కాస్త సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది. ఇటీవలే ఆడిలైట్ వేదికగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు.  ఈ క్రమంలోనే మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదట్లోనే కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ డేవిడ్ మాలాన్ విధ్వంసం కారణంగా 287 పరుగులు చేయగలిగింది.


 అయితే ఇక ఆ తర్వాత లక్ష్య  చేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 46.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే విల్లె బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన వార్నర్ తన సహచర ఆటగాళ్లతో డగ్ అవుట్ లో కూర్చున్నాడు.  ఇంతలోనే స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ఓ చిన్నారి అభిమాని డేవిడ్ వార్నర్.. నీ షర్టు నాకు ఇస్తావా అంటూ రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు.. కెమెరామెన్ ఇది జూమ్ చేయడంతో ఇక బిగ్ స్క్రీన్ పై దీనిని చూసిన వార్నర్ సరదాగా బదులిచ్చాడు. ఇక్కడికి వచ్చేయ్.. మార్నస్ షర్ట్ తీసుకో అంటూ డగౌడ్ దగ్గరికి రమ్మన్నాడు. దీంతో ఆ పిల్లాడు మార్నస్ ని షర్ట్స్ నాకు ఇస్తావా అంటూ మరో ఫ్లకార్డు ప్రదర్శించాడు. దీంతో వార్నర్ నవ్వుతూ రండి రండి అంటూ సైగ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: