ఐపీఎల్ వేలంలో కామరూన్ గ్రీన్.. ఆసిస్ కెప్టెన్ ఏమన్నాడంటే?
అయితే తమ జట్టులో ఉన్న ఆటగాళ్లను మాత్రం ఐపీఎల్ ఆడవద్దు అంటూ ఎలాంటి నిబంధనలు పెట్టబోనని చెప్పుకొచ్చాడు ప్యాట్ కమ్మిన్స్. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ ఇటీవల వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతనికి 2023 ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది. అయితే తమ జట్టు ఆల్రౌండర్ ఐపీఎల్లో ఆడటం గురించి ఇటీవలే ప్యాట్ కమ్మిన్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2023 ఐపీఎల్ లీగ్ వేలంలోకి రావాలని కామరూన్ గ్రీన్ భావిస్తే అతడి కోసం భారీగా బిట్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్యాట్ కామెంట్స్ స్పందిస్తూ.. అవును.. భారత టి20 లీగ్ వేలంలోకి కామరూన్ గ్రీన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి చూద్దాం. అయితే ఒక జట్టు కెప్టెన్ గా నేను కొంత స్వార్థంగా ఆలోచిస్తే మాత్రం ఆటగాళ్ల శక్తిని అంతా కూడా దేశం కోసం ఆడేందుకే ఉపయోగించుకోవాలి అని అనుకుంటాను. కానీ భారత టి20 లీగ్ లాంటి గొప్ప అవకాశాన్ని వదులుకోవాలని ఎవరికైనా మనం ఎలా చెప్పగలం అంటూ ప్యాట్ కమ్మిన్స్ వ్యాఖ్యానించాడు.