ఐపీఎల్ లో ఎక్కువ సంపాదించిన ఆటగాళ్లు.. ఈ ముగ్గురేనట?
అంతేకాకుండా ప్రపంచ క్రికెట్లో ఉన్న అద్భుతం ఆటగాళ్లతో ఇక డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా సరికొత్త అనుభూతి, అనుభవం పొందేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది అని చెప్పాలి. అందుకే ఎంతో మంది విదేశీ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పాలి. అయితే 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంది బీసీసీఐ. ఇకపోతే ఇటీవల ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు ఎన్ని వందల కోట్ల వరకు సాలరీలు చెల్లించింది అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక ఇప్పుడు మరో విషయం చర్చనీయాంశంగా మారింది అని చెప్పాలి. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎవరు ఎక్కువ మొత్తంలో సంపాదించారు అన్న విషయంపై చర్చించుకుంటున్నారు అందరూ. అయితే ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లో కలిపి అత్యధికంగా డబ్బు సంపాదించిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ టీమిండియా మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించాడు. ధోని మొత్తంగా ఐపీఎల్ ద్వారా 164.8 కోట్లు సంపాదించాడు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 162.6 కోట్లు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ 158.2 కోట్లు ఐపీల్ ద్వారా సంపాదించి టాప్ త్రీ లో కొనసాగుతున్నారు.