ఇండియా vs బంగ్లా మ్యాచ్.. అల్లర్లకు అవకాశం?
న్యూజిలాండ్ పర్యటనలో ఇప్పటికే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఇక మరికొన్ని రోజులు వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ పర్యటన ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైంది టీమ్ ఇండియా అన్న విషయం తెలిసిందే. అక్కడ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ తో పాటు రెండు టెస్టులు కూడా ఆడబోతుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మొత్తం కూడా బంగ్లాదేశ్ రాజధాని నగరమైన డాఖా లో జరగబోతుంది.
కానీ మూడో వన్డే విషయం లో మాత్రం ఇక మ్యాచ్ జరగాల్సిన వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలుస్తుంది. ఇది కాస్త ప్రస్తుతం ఆ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగం గా డిసెంబర్ 10వ తేదీన మూడవ వన్డే మ్యాచ్ జరగ బోతుంది. ఇది కూడా ముందుగా నిర్ణయించిన ప్రకారం డాఖా వేదికగానే జరగాలి. కానీ ఇటీవల ఈ వేదికను చిట్ట గాంగ్ కు మార్చారు. అదేరోజు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ డాఖా లో నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.