ఏమయ్యా హార్దిక్.. 5మ్యాచ్ లకే.. ఇంత బిల్డప్ అవసరమా?
న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ఆడిన టీమిండియా కు అదృష్టం కలిసొచ్చి ఇక 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ రద్దు కావడం ఇక రెండవ మ్యాచ్ లో టీమిండియా గెలవడం.. మూడో మ్యాచ్ వర్షం కారణంగా టై కావడంతో.. టీమిండియా సిరీస్ గెలుచుకుంది. అయితే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కూడా అటు రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్‌లకు ఛాన్స్ ఇచ్చి.. యువ ఆటగాళ్లు సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లను పక్కన పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పాండ్య వచ్చిన తర్వాత అయినా పరిస్థితి మారుతుంది అనుకుంటే.. మళ్ళీ సీనియర్లకే అవకాశం ఇచ్చాడు అంటూ ఎంతో మంది ట్రోల్స్ చేశారు.
ఇకపోతే ఇటీవల తనపై వస్తున్న విమర్శలపై కాస్త తిక్కగా సమాధానం ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. ఇది నా జట్టు ఎవరిని ఎంపిక చేయాలి అన్నది కూడా నా ఇష్టం. కోచ్ తో చర్చించిన తర్వాతే జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను ఎంపిక చేస్తాను. ఎవరో విమర్శలు చేస్తే అది నాపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకసారి జట్టులోకి వస్తే ఎక్కువ రోజులు కొనసాగుతారంటూ హర్దిక్ పాండ్యా సమాధానం చెప్పాడు. అయితే హార్దిక్ చెప్పిన తిక్క సమాధానం ఎవరికీ నచ్చడం లేదు. కేవలం ఐదు మ్యాచ్‌లకు కెప్టెన్ గా ఉంటేనే ఇంత ఆటిట్యూట్ చూపిస్తే ఇక పూర్తిస్థాయి కెప్టెన్ గా మారితే హార్దిక్ ఇంకెలా ఉంటాడో అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడో.. ఐదు మ్యాచ్‌లకి ఇంత బిల్డప్ అవసరం లేదని టీమిండియా కెప్టెన్ అంటే ఒదిగి ఉండాలని ఈ విషయం సీనియర్లను చూసి నేర్చుకోవాలి అంటూ ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు అని చెప్పాలి.