వరల్డ్ కప్ గెలవాలంటే.. ఐపీఎల్ ఆడకండి?
అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగానే ఆటగాళ్లు విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతూ ఉండడంతో ఇక టీమ్ ఇండియా తరఫున తమ పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారని.. ఇదే టీమిండియా కు మైనస్ గా మారిపోతుందని కొంతమంది కొత్త వాదన తిరమీదికి తీసుకువస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్. భారత ఆటగాళ్లందరూ కూడా ఐపీఎల్ ఆడవద్దు అంటూ సూచించాడు.
భారత జట్టు లో ఓపెనర్లు ఫిక్స్ కాకపోవడంతో గత ఏడు నెలల నుంచి జట్టులో స్థిరత్వం కనిపించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఓపెనింగ్ బౌలర్లు కూడా మారుతూనే వస్తూ ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు పని భారం పేరుతో అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉంటూ భారత టి20 లీగ్ లో ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పని భారంతో ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నామని చెబుతున్నారు. అసలు ప్రొఫెషనల్ క్రికెటర్లకు వర్క్ లోడ్ సమస్య ఏంటి.. అలాంటప్పుడు మీరు భారత టి20 లీగ్ లో ఎందుకు ఆడుతున్నారు. ప్రపంచకప్ గెలవాలనుకుంటే భారత టి20 లీగ్ ఆడకండి. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు అంటూ దినేష్ లాడ్ చెప్పుకొచ్చాడు.