
జట్టులో చోటుకే దిక్కులేదు.. అతను కెప్టెన్ ఏంటి?
ఈ క్రమంలోనే ఇక రోహిత్ శర్మ తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ కాబోయేది ఎవరు అన్న చర్చ జరుగుతూ ఉండగా.. హార్దిక్ పాండ్యా పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. అంతకుముందు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి యువ ఆటగాళ్ల పేరు తెర మీదికి రాగా ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరించి టైటిల్ అందించడంతో హార్దిక్ కెప్టెన్ గా సరైన ఆటగాడు అంటూ ఎంతో మంది చర్చించుకున్నారు. ఇకపోతే ఇక ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయితే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన గౌతమ్ గంభీర్ సరికొత్త పేరును తెరమీదకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రోహిత్ తర్వాత పాండ్యా కెప్టెన్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే అతనికి భారత జట్టు కెప్టెన్ కాగల అర్హత ఉంది అంటూ గౌతమ్ గంభీర్ పేర్కొనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా కెప్టెన్సీ రేస్ లో పృద్విషా పేరును తెరమీదకి తీసుకురావడంతో కొంతమంది భిన్నంగా స్పందిస్తున్నారు. అతనికి జట్టులో ఆడటానికి చోటు దిక్కులేదు. ఇక కెప్టెన్ అవడం ఏంటి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.