సీఎస్కే వదిలేసిన ఈ ముగ్గురికి.. సూపర్ డిమాండ్ ఉంటుందట?
ఇలాంటి సమయంలోనే ఇక ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఈ విషయంపై ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ రివ్యూలను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ముగ్గురు ఆటగాళ్లకు మరికొన్ని రోజుల్లో జరగబోయే మినీ వేలంలో తెగ డిమాండ్ ఉండబోతుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరంటే..
నారాయన్ జగదీషన్ : పేలువ ప్రదర్శన చేయడంతో ఇతన్ని వేలంలోకి వదిలేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కానీ ఇటీవల విజయ్ హాజరే ట్రోఫీ లో అదరగొట్టిన జగదీషన్ కు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
ఆడమ్ మిల్నే : ఈ స్టార్ ప్లేయర్ ను ఒకటి పాయింట్ 9 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఇక ఇప్పుడు మినీ వేలంలోకి వదిలేసింది. అయితే 150 కిలోమీటర్ల పైగా వేగంతో బందులు విసిరే ఇతనికి భారీ డిమాండ్ ఉండబోతుందని తెలుస్తుంది.
క్రిస్ జోర్డాన్ : గత సీజన్లో 3.60 కోట్లు పెట్టి ఇతని కొనుగోలు చేసింది సి ఎస్ కే. దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఇతని మెనీ వేలంలోకి వదిలేసింది. కానీ ఇప్పుడు టి20 ప్రపంచకంలో మంచి ప్రదర్శన చేయడంతో అతనికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది.